ముగిసిన వైసిపి ప్రచార జోరు * కార్పొరేటర్ అభ్యర్థి సత్యాల సాగరిక వెంకట్ *
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ, 16వ వార్డు కార్పొరేటర్ వైసిపి అభ్యర్థి సత్యాల సాగరిక వెంకట్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులో రోడ్ షో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో వైసిపి సీనియర్ నాయకుడు సంపంగి వాసు, వైసిపి కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.