BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

మానవత్వానికి మారుపేరు రెంటికోట యువత.

Select Suryaa Now
మానవత్వానికి మారుపేరు రెంటికోట యువత.

 

ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి రక్తదానం చేసిన జోగ నవీన్, జోగ జగదీష్.

పలాస, నవంబర్ 28,మేజర్ న్యూస్.

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో రెంటికోట యువత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన యువకులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన మోనియా చామంతి (27) అనారోగ్య సమస్యతో బాధపడుతూ కాశీబుగ్గ లోని సుశృత నర్సింగ్ హోమ్ (డాక్టర్ బీమారావు ఆసుపత్రి) లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే రెంటికోట గ్రామ యువత స్పందించి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ వంతు సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా రెంటికోటకు చెందిన జోగ నవీన్, జోగ జగదీష్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.చెప్పిన వెంటనే స్పందించిన వీరిద్దరికీ గ్రామ యువత అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రక్తదానం అనేది కేవలం దానం మాత్రమే కాదని, ఆపదలో ఉన్నవారికి మనం అందించే ప్రాణదానమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని, ఆరోగ్యపరంగా అర్హులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం చేసే చిన్న సహాయం మరొకరి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మను యాదవ్,వేణు యాదవ్,పారిగ రాధాకృష్ణ,బాలరాజు,హారియా మణి, రవి,మోనియా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.