BREAKING
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : సీఎం చంద్రబాబు అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నంద్యాల విద్యార్థి హర్షవర్ధన్ కేబీసీ షూటింగ్‌లో ప్రమాదం.. జారిపడ్డ అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం రిజల్యూషన్ ఎసోపగీల్ మానోమెట్రీ అను పరికరమును ప్రారంభించిన మంత్రి టీ.జి భరత్, గాంధీ జయంతి ఆంక్షలు అమలయ్యేనా..? స్త్రీశక్తి, దీపం, తల్లికి వందనం పథకాలతో మహర్దశ.. సీఎం చంద్రబాబు 36 ఏళ్లకు పైగా పోలీసు సేవలు.. ట్రాఫిక్ ఎస్సై రామచంద్రారెడ్డికి ఘన సన్మానం పింఛన్ దారులకు ఇచ్చిన హామీ తప్పిన జగన్మోహన్ రెడ్డి - మంత్రి ఫరూక్ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి శనివారం ప్రభుత్వ బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్! సంక్షేమ పథకాల కన్వర్జెన్స్‌తో పేదలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చాలి: సీఎం చంద్రబాబు ఆదేశం ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి… ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజి రెడ్డి జాతీయ యోగాలో పతకాలు సాధించాలి… రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి ఎన్ సిద్ధారెడ్డి ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల ఆహ్వాన పుస్తకాలు ఆవిష్కరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని వీరేష్ ముదిరాజ్ రేసులో దూకుడు...? అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు - మంత్రి ఫరూఖ్, కలెక్టర్ రాజకుమారి గణియా

మాజీ ఎంపీటీసీ భర్త మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మన శ్రీరాంరెడ్డి

Select Suryaa Now
మాజీ ఎంపీటీసీ భర్త మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మన శ్రీరాంరెడ్డి

అనంతపురం బ్యూరో : సింగనమల మండలం మాజీ ఎంపీటీసీ కప్పల ఉమాదేవి భర్త, వైఎస్సార్‌సీపీ కార్యకర్త కప్పల నారాయణస్వామి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రెటరీ బొమ్మన శ్రీరాంరెడ్డి, సింగనమల యూత్ కన్వీనర్ దిద్దుకుంట భాస్కర్‌రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.

కప్పల నారాయణస్వామి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వారు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారాయణస్వామి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షుడు అప్పేచెర్ల అబ్దుల్, కొప్పెర్ల గోవింద్‌రెడ్డి, చింటూ, వీరాంజనేయులు, రాజు, ఉద్దాల నారాయణస్వామి, గోపి యాదవ్, చంద్రమౌళి యాదవ్, ఆలీ భాష తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.