కేజే పురం పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి ప్రచారం
ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం
వి. మాడుగుల, నవంబర్ 29: మేజర్ న్యూస్ వి. మాడుగుల మండలంలోని మేజర్ పంచాయతీ కేజే పురంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బి. శెట్టి విజయలక్ష్మి తనకు కేటాయించిన ఉంగరం గుర్తుతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. తమ అభ్యర్థి ఉంగరం గుర్తును ఓటర్లు గుర్తుంచుకుని, అదే గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.ప్రచారంలో భాగంగా ఉంగరం గుర్తుతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓటర్లకు తమ అభ్యర్థి గుర్తును వివరిస్తున్నారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతును కోరుతున్నారు.