కే జి హెచ్ ఆర్థోపెటిక్ విభాగంలో ప్రధానమంత్రి రాహత్ స్కీంతో ఇతర రాష్ట్రాల రోగుల వైద్య సేవలకు వెసులుబాటు
విశాఖపట్నం, సూర్య : కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగం సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లభించే కార్పొరేట్ తరహా వైద్య చికిత్సలు ఆర్థోపెటిక్ విభాగంలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు ఆర్థోపెటిక్ విభాగం డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు. సోమవారం సూర్య ప్రతినిధితో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల కు చెందిన రోగుల కోసం ప్రధాన మంత్రి రాహత్ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన పథకం ఆర్థో విభాగంలో అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా కేవలం ఆధార్ కార్డు ఆధారంగా ఆసుపత్రికి వచ్చే ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మన్యం ప్రాంతాలకు చెందిన రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రస్తుతం అన్ని రకాల ఇంప్లాంట్స్ సర్జరీకి ఉచితంగానే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉంటూ కేజీహ్ చ్ ఆర్తో విభాగానికి వచ్చే రాష్ట్రానికి చెందిన రోగులకు ఉచిత సేవలో అంతవరకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. నగరంలో పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాలకు చెందిన రాజస్థాన్,కలకత్తా రాష్ట్రాలకు చెందిన ఇంటి ఇంటి నిర్మాణం కూలీలు, ఇంటీరియల్ పనులు చేసే పనివారు ప్రమాదానికి గురై శరీరంలో ఎముకలు విరిగినట్లయితే చికిత్స అందించడం ఇంప్లాంట్స్ వచ్చే విధంగా వారికి ఏర్పాటు చేయడం ఇబ్బందికరంగా ఉండేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ స్కీం ద్వారా కేవలం ఆధార్ తోనే వైద్య సేవలు ఇంప్లాంట్స్ సర్జరీలు ఎటువంటి ఖర్చులు లేకుండా వారికి అందించే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఆకుతో విభాగంలో నాలుగు సెంట్రల్ సెక్షన్స్ సిఆర్మ్స్, షోల్డర్ నీ జాయింట్ సర్జరీలు మూడు విభాగాల ద్వారా పూర్తిస్థాయిలో కేజీహెచ్ రోగులకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 180 పడకలు మూడు యూనిట్లతో ఆర్థోపెటిక్ సేవలు నిత్యం రోగులకు పూర్తిస్థాయిలో అందుతున్నట్లు వెల్లడించారు. విశాఖ కపుల్స్ రోటరీ అందించిన 8 లక్షల వ్యయంతో ఇటీవల ఇంప్లాంట్స్ కొనుగోలు చేసి రోగులకు వినియోగిస్తున్నామన్నారు. ఆర్థోస్కోపి రూ. 10 లక్షలు వరకు ఉంటుందని, పరికరం అందుబాటులోకి వస్తే కీ హోల్ సర్జరీలకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్థోపెటిక్ వైద్య సేవలు పేద మధ్యతరగతి కుటుంబాలు రోగులకు అందనంత స్థితిలో ఉందన్నారు. కేజీహెచ్ ఆర్థోపెటిక్ విభాగo ఖరీదైన వైద్య సేవలను పేద మధ్యతరగతి రోగులకు అందుబాటులో ఉందని తెలియజేశారు. కేజీహెచ్ సూపరిం టెం డెంట్ డాక్టర్ వాణి ఆర్థోపెటిక్ విభాగానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఖరీదైన వైద్య పరిక రాలు ద్వారా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. విభాగాధిపతిగా ఆర్థోపెటిక్ విభాగానికి అవసరమైన వైద్య పరికరాలు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదo లో ఎముకలు విరిగి ఆసుపత్రికి వచ్చే క్షతగాత్రులకు అత్యవసర సర్జరీ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.