BREAKING
దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి.. నిధి పోర్టల్‌ సమస్యలు తొలగించాలి కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌కు జీవీఎంసీ కాంట్రాక్టర్ల వినతి

Select Suryaa Now
కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి  పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి..  నిధి పోర్టల్‌ సమస్యలు తొలగించాలి  కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌కు జీవీఎంసీ కాంట్రాక్టర్ల వినతి

కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి..

నిధి పోర్టల్‌ సమస్యలు తొలగించాలి

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌కు జీవీఎంసీ కాంట్రాక్టర్ల వినతి

విశాఖపట్నం, మేజర్ న్యూస్ : 
జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్‌ కిషోర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, నిధి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలు, ప్యాకేజీ విధానంలో పనుల టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు సమ్మె నోటీసుకు సంబంధించిన విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

జీవీఎంసీ పరిధిలో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులను చేపడుతున్న కాంట్రాక్టర్లకు సంబంధించి పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సంఘం ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. పనులు పూర్తిచేసిన అనంతరం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్‌ బిల్లులను పరిశీలించి త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే జీవీఎంసీ పనులకు సంబంధించిన వివరాలను నిధి పోర్టల్‌లో నమోదు చేయడం, పనుల బిల్లుల ప్రక్రియ తదితర అంశాల్లో ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీ విధానంలో పనులకు టెండర్లు పిలిచే అంశంపై కూడా తమ అభ్యంతరాలు, సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత సమస్యలపై సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే తాము చేపట్టనున్న తదుపరి కార్యాచరణ, సమ్మె నోటీసుకు సంబంధించిన అంశాలను కూడా ప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.వి. నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. సంజీవరెడ్డి, సంస్థాగత కార్యదర్శి మద్దాల రమేష్‌, ఏఆర్‌ అప్పలరాజు, కాళ్ల అప్పలనాయుడు, చిట్టిబాబు, సిరికి శ్రీనివాసరావు, కోడూరు నారాయణరావు, కార్యవర్గ సభ్యులు, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.