BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

ఎన్నికలు జరిగాయి… ప్రజాస్వామ్యం గెలిచిందా?

Select Suryaa Now
ఎన్నికలు జరిగాయి… ప్రజాస్వామ్యం గెలిచిందా?

లక్క వరపు కోట నవంబర్ 28 మేజర్ న్యూస్ :ప్రస్తుతం ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓటరు బాధ్యత, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నిజాయితీపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలు జరిగాయి.. ఓట్లు పడ్డాయి.. కొందరు గెలిచారు.. మరికొందరు ఓడిపోయారు. కానీ ఈ ఎన్నికల్లో నిజంగా గెలిచింది ప్రజాస్వామ్యమేనా? అన్న ప్రశ్న మాత్రం ఆలోచింపజేస్తోంది.
ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు? అధికారాన్ని ఒక హోదాగా, ఆభరణంగా భావించి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎంతమంది పోటీ చేశారు? ఓటరు అభిమానం, నమ్మకం, ఆశీర్వాదంతో గెలిచినవారు ఎంతమంది? డబ్బు, ఇతర ప్రలోభాల ప్రభావంతో విజయాన్ని సాధించినవారు ఎంతమంది? అన్నది సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం.
ఒకవైపు ఓటు కోసం డబ్బు, బహుమతులు, ఇతర ప్రలోభాలను ఆశించే ఓటర్లు ఉంటే.. మరోవైపు ఓటును కొనుగోలు చేసి గెలుపును సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు కూడా ఉన్నారు. కొందరు ఇచ్చింది తీసుకుంటే, మరికొందరు అడిగి తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటు విలువ ఎంత మిగిలింది? ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి?
ఎన్నికల సమయంలో ఓటరు అభ్యర్థిని నిలదీస్తాడు.. అభ్యర్థి ఓటరును అభ్యర్థిస్తాడు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత, గెలిచిన నాయకుడు ఓటరును ఎదుర్కొన్నప్పుడు, ఓటరు నాయకుడిని ప్రశ్నించినప్పుడు వారి మధ్య నిజాయితీతో కూడిన సంబంధం కొనసాగుతుందా? డబ్బు ప్రభావంతో ఏర్పడిన సంబంధమా? లేక ప్రజా సమస్యలపై నిలదీసే హక్కుతో ఏర్పడిన ప్రజాస్వామ్య బంధమా?
నేను నీకు డబ్బు ఇచ్చాను.. నువ్వు నాకు ఓటు వేయాలి” అనే ఆలోచన అభ్యర్థిలో ఉంటే, “నువ్వు నాకు డబ్బు ఇచ్చావు కాబట్టి ఓటు వేశాను” అనే భావన ఓటరులో ఉంటే, అక్కడ ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి? రేపు అదే ఓటరు ప్రజా సమస్యపై నాయకుడిని ప్రశ్నించగలడా? నాయకుడు కూడా తనను ఓటుతో గెలిపించిన ప్రజల ముందు బాధ్యతగా నిలబడగలడా?
ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరినీ అవినీతిపరులుగా చూడలేం. ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ప్రలోభాలకు లొంగినవారిగా భావించలేం. ప్రజల అభిమానం, వ్యక్తిగత విశ్వాసం, పార్టీ సిద్ధాంతాలు, అభ్యర్థి సేవాభావం ఆధారంగా ఓటు వేసిన నిజాయితీగల ఓటర్లు, ప్రజాసేవ కోసం పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే వారి సంఖ్య ఎంత? ప్రలోభాలకు లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న ఓటర్లు ఎంతమంది? పదవి కోసం కాకుండా సేవ కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఎంతమంది? అనేది సమాజం ఆలోచించాల్సిన ప్రశ్న.
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం, ఓట్లు లెక్కించడం, విజేతలను ప్రకటించడం మాత్రమే కాదు. ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయం, అభ్యర్థుల నైతికత, ఓటు విలువ, గెలిచినవారి ప్రజా బాధ్యత కలిసినప్పుడే ప్రజాస్వామ్యం నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది.
ఓటు అమ్ముకున్నవాడు రేపు ప్రశ్నించే హక్కును తనంతట తానే బలహీనపరుచుకుంటాడు. ఓటు కొనుగోలు చేసినవాడు రేపు ప్రజాసేవ కంటే తన పెట్టుబడి తిరిగి పొందాలనే ఆలోచనకు లోనయ్యే ప్రమాదం ఉంది.*
అందుకే ఎన్నికల్లో గెలిచినవారంతా నిజమైన నాయకులు కావాలంటే ప్రజల అభిమానంతో గెలవాలి. ఓటు వేసినవారంతా నిజమైన ఓటర్లు కావాలంటే ప్రలోభాలకు లొంగకుండా తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలి.
ఎన్నికలు ముగిసిపోయాయి. గెలుపోటములు కూడా నిర్ణయమయ్యాయి. కానీ ప్రజాస్వామ్యానికి పరీక్ష ఇప్పుడే మొదలైంది.
గెలిచిన నాయకుడు ప్రజల ముందు తలెత్తుకుని నిలబడగలగాలి… ఓటు వేసిన ఓటరు తన ఓటు పట్ల గర్వపడగలగాలి… ఈ రెండూ జరిగినప్పుడే ఎన్నికలు నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలుగా నిలుస్తాయి.*
లేకపోతే ఎన్నికలు జరుగుతాయి… ఫలితాలు వస్తాయి… పదవులు మారుతాయి… కానీ ప్రజాస్వామ్య విలువలు మాత్రం క్రమంగా కనుమరుగవుతాయి.