ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: గాజువాక సీఐ వాసునాయుడు
గాజువాక, సూర్య : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని గాజువాక సీఐ చింతా వాసునాయుడు కోరారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపు తుంగలాం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలకు దిగినా, బెదిరింపులకు పాల్పడినా లేదా అల్లర్లు సృష్టించినా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా గ్రామస్థులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.