BREAKING
శివశంకర్ కాలనీలో వైసిపి గర్భ గర్వపు ప్రచారం సర్వేపల్లి రిజర్వాయర్‌లో 3.18 లక్షల చేప పిల్లల విడుదల రైతులకు 100% రాయితీపై పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. 3 రోజులు మద్యం షాపులు బంద్! స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించండి: జిల్లా కార్యదర్శి అరిగెల సాయి పిలుపు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ.. చైనాపై ఘన విజయం సాధించిన భారత జట్టు! కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనలు: సీపీఐ రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్ పొన్నూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహావిష్కరణలో పాల్గొన్న......... ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఎన్నికల విధుల పర్యవేక్షణలో లోపాలు సహించేది లేదు : జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కూటమితోనే సంక్షేమాభివృద్ధి 40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ సుడిగాలి పర్యటన - చివరి రోజు గ్రూలింగ్స్ పేట - ఎంజీఆర్ వీధిలో విస్తృత ప్రచారం - మేయర్ గా హేమలతకు మద్దతు కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియోవైద్యులు కరుణాకర్ హైలో ఓపెన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు జోరు.. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్! వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి.. * ఆరోగ్య విస్తరణ అధికారి నల్లి రవికుమార్ *

ఎన్నికల ప్రచారంతో దద్దరిల్లిన తిరునగరి

Select Suryaa Now
ఎన్నికల ప్రచారంతో దద్దరిల్లిన తిరునగరి

తిరుపతి 

తిరుపతి కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార ముగింపులో కూటమి శ్రేణుల ప్రభంజనం………..

జనసంద్రమైన వీధులు బాణసంచా మెరుపులు, పూల వర్షంతో దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరి……….

 

తిరుపతి నగర పాలక సంస్థ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వానికి ఎన్డీఏ కూటమి శ్రేణులు అట్టహాసంగా ముగింపు పలికాయి. ప్రచార చివరి రోజున కూటమి శక్తి ఏమిటో చాటిచెబుతూ కోర్లగుంట రోడ్డులో నిర్వహించిన భారీ ర్యాలీ తిరుపతి రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలతో కోర్లగుంట ప్రధాన రహదారి జనసముద్రాన్ని తలపించింది.ర్యాలీ ప్రారంభమైనప్పటి నుండి ముగిసే వరకు కోర్లగుంట పరిసర ప్రాంతాలు కూటమి జెండాలతో రెపరెపలాడాయి. ఒకవైపు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు, మరోవైపు డప్పు వాయిద్యాలు, తీన్మార్ నృత్యాలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేతలపై స్థానికులు, మహిళలు భవనాల పైనుండి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.జై కూటమి నినాదాలతో కోర్లగుంట వీధులు మార్మోగిపోయాయి. ఈ మెగా ర్యాలీలో కూటమి ముఖ్య నేతలు ఒకే వేదికపై కదం తొక్కడంతో కార్యకర్తల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడు ఆరణి మదన్  ఈ ర్యాలీలో పాల్గొన్నారు.  ప్రజలకు అభివాదం చేస్తూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ నేతలు ముందుకు సాగారు. తిరుపతి నగర సర్వతోముఖాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కోర్లగుంటలో కనిపిస్తున్న ఈ ప్రజా ప్రభంజనమే రేపటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల అఖండ విజయానికి నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా, తిరుపతి కార్పొరేషన్‌లో పారదర్శక పాలన అందాలన్నా కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు వేలాదిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.