ఈనెల 30న పోస్టల్ బ్యాలెట్ సద్విని చేసుకోవాలి "ఎంపీడీవో రవికుమార్"
గుర్ల, నవంబర్ 28 మేజర్ న్యూస్: మండలంలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులందరూ తమ ఓటును ఈ నెల 30న పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకోవాలని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల విధులలో భాగంగా ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేయబడిందనీ గుర్ల మండలంలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులందరూ ఓటు వేయడానికి గుర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు. తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఓటు వేసేవారు
ఎన్నికల విధులకు సంబంధించిన నియామక ఉత్తర్వు (Election Duty Order).మీ శాఖకు సంబంధించిన గుర్తింపు కార్డు (Department ID Card). తీసుకురావాలన్నారు.