చిత్తూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్::చిత్తూరు నగర కార్పొరేషన్ ఎన్నికల సమరంలో కూటమి తన ప్రచార శంఖారావాన్ని పూరించింది.
కూటమి అధికారిక మేయర్ అభ్యర్థి కటారి హేమలత ఎన్నికల ప్రచార కార్యక్రమం చిత్తూరు నగరంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ ప్రచార కార్యక్రమంలో చిత్తూరు లోక్‌సభ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టిడిపి సీనియర్ నేత చంద్ర ప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ప్రచారాన్ని ముందుకు నడిపించారు.ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ, చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమన్నారు. నగర ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలిసిన, నిరంతరం ప్రజల్లో ఉండే సమర్థురాలైన నాయకురాలు కటారి హేమలత అని వారు కొనియాడారు. నగరంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, ప్రజా రక్షణే ధ్యేయంగా కూటమి ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.నగర ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని, కూటమి అభ్యర్థి కటారి హేమలత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు నగర ప్రజలకు, ఓటర్లకు ఎంపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చిత్తూరు నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని, అభ్యర్థికి తమ పూర్తి మద్దతును పలికారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్