కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వైసీపీ-ఎసిపిఐ పొత్తు - నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష,
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పోరాటానికి వైసీపీ, ఎసిపిఐ పొత్తు కుదిరినట్లు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాష అన్నారు. ప్రజల కోసం ఐక్యపోరాటాలతోపాటు ప్రజా హక్కుల కోసం రాజకీయ సమన్వయంతో పొత్తు ఏర్పడినట్లు వెల్లడించారు. వైసీపీ కార్యాలయంలో గురువారం పొర్టు కుదిరిన తరువాత మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ నంద్యాలలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు వ్యతిరేకిస్తూ ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పొత్తుతో ముందుకు సాగుతామన్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎసిపిఐ పార్టీ ఈ ఎన్నికల్లో వైసీపీతో కలిసి ప్రజా సమస్యలను ప్రజా వేదికపైకి తీసుకొనిరావడానికి సిద్ధమైందన్నారు. పార్టీల మధ్య పొత్తు ఎన్నికలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధి, ప్రజల హక్కుల పరిరక్షణ దిశగా సాగాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 5, 6,7 వార్డులల్లో ఎస్ఎపిఐ పార్టీ అభ్యర్థులు వైసీపీ ఫ్యాను గుర్తుపై పోటీ చేయనుండగా, వైసీపీ నంద్యాల ఛైర్మెన్ అభ్యర్ధికి, మిగిలిన 49 వార్డుల వైసీపీ పార్టీ అభ్యర్థులకు ఎసిపిఐ పార్టీ సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తోందన్నారు. 5వ వార్డు నుంచి మజీద్ ఖాన్, 6 వార్డు నుంచి పూల జరీనా, 7వ వార్డు నుంచి ఏజాస్ హుస్సేన్లు పోటీ చేస్తున్నట్లు వెలడించారు.