BREAKING
ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు *మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గవ్వ వంశీధర్ రెడ్డి

చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది.."పోషణ్ భీ-పడాయీ భీ"

Select Suryaa Now
చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది.."పోషణ్ భీ-పడాయీ భీ"

గరుగుబిల్లి, సూర్య : అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగానే కాకుండా,నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించే అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మహిళా మరి యు శిశు అభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘పోషణ్ భీ, పఢై భీ’ (పోషణతో పాటు చదువు కూడా) కార్యక్రమం అమలుకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమమును నిర్వహించడం జరుగుతోందని కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణ కుమారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ, పడా యిభీ’ కార్యక్రమంపై మంగళవారం నుంచి రెండు రోజులపాటు శిక్షణా కార్యక్రమ మును నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి అంగన్వాడీ కార్యకర్త లను ఉద్దేశించి మాట్లాడారు.జాతీయ నూతన విద్యా విధానం  మార్గదర్శకాలకు అనుగుణంగా ఈకార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. చిన్నారులలో 85 శాతానికి పైగా మెదడు అభివృద్ధి 6 సంవత్సరాల వయస్సు లోపే జరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయ న్నారు. ఈనేపథ్యంలో 0 నుండి 6 సంవత్సరాలలోపు చిన్నారులకు బలవర్ధకమైన ఆహారంతో పాటు, వారి వయస్సుకు తగినట్లుగా ఆటపాటల ద్వారా విద్యను అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పారు. అదే విధంగా 0 నుండి 3 ఏళ్ల చిన్నారుల మేధో ప్రేరణ కోసం ‘నవ చేతన’ 3 నుండి 6 ఏళ్ల పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యాభ్యాసం కోసం ‘ఆధారశిల’ పేరిట ప్రత్యేక పాఠ్యప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. చిన్నారులు సులభంగా అర్థం చేసుకునేలా వారి మాతృభాష లోనే బోధన సాగుతోందన్నారు. గరుగుబిల్లి, పెదగుడబ ఐసిడిఎస్ సెక్టార్ ల సూపర్వైజర్లు రౌతు లక్ష్మి,పి బంగారమ్మలు మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ  చేపట్టిన ‘పోషణ్ భీ, పఢాయి భీ’ కార్యక్రమం అంగన్‌ వాడీ కేంద్రాల రూపురేఖలను సమూ లంగా మార్చివేస్తోందన్నారు.కేవలం పౌష్టికాహార పంపిణీ కేంద్రాలకే పరిమితం కాకుండా, అంగన్‌వాడీలను నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. చిన్నారులకు పోషకాహారంతో పాటు మానసిక, మేధో వికాసాన్ని అందించేలా ఈకార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.