బొర్రంపాలెం జాబ్ మేళాలో 104 మందికి ఉద్యోగాలు 159 మంది హాజరు.. 20 మంది రెండో విడత ఇంటర్వ్యూలకు ఎంపిక
టీ నర్సాపురం సూర్య న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా, టి. నరసాపురం మండలం బొర్రంపాలెంలోని గ్రీన్ బర్డ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో మొత్తం 159 మంది యువతీ యువకులు హాజరుకాగా, వారిలో 104 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 20 మందిని రెండో విడత ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు ఏలూరు జిల్లా డీఎస్‌డీవో ఎన్. జితేంద్రబాబు తెలిపారు.ఈ జాబ్ మేళాలో మొత్తం 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జే. వెంకట్, ఏఎస్ఓ అధికారి, సీహెచ్. వెంకటరావు, అసిస్టెంట్ డైరెక్టర్, గ్రీన్ బర్డ్స్ హైస్కూల్ కరస్పాండెంట్లు ప్రేమ్ కుమార్, ప్రకాష్, ప్లేస్‌మెంట్ అధికారి శ్యామ్‌తో పాటు ఏపీఎస్ఎస్‌డీసీ సిబ్బంది పాల్గొన్నారు.
పసుమర్తి రాము, జిల్లా ఇంచార్జ్ ఏలూరు