బోగోలు లో తొలిరోజు రెండు నామినేషన్ల
బిట్రగుంట, మేజర్ న్యూస్ : ఎన్నికల ప్రక్రియలో భాగంగా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో బుధవారం తొలిరోజు ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు లో భాగంగా ఇద్దరు నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా బోగోలు మండలంలో నామినేషన్ల పర్వం మొదలైంది. విశ్వనాథరావుపేట మేజరు పంచాయితీ బిట్ 2 నుండి బొడ్డు అరుణకుమారి, బొడ్డు దొరసానమ్మలు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయగా, జక్కెపల్లి గూడూరు నుండి వైసిపి అభ్యర్థిగా అరటి పల్లి సుజాత రెండుశెట్లునామినేషన్లు సమర్పించినట్లు బోగోలు మండల ఎన్నికల అధికారి ఏ రామారావు తెలిపారు. మండలంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల అధికారి తెలిపారు. బోగోలు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, బిట్రగుంట ఎస్సై రామకృష్ణ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.