BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే

Select Suryaa Now
ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే

చీపురుపల్లి మేజర్ న్యూస్: చీపురుపల్లి ఆర్ఈసిఎస్ లో అప్పటి  మేనేజింగ్ డైరెక్టర్  పి. రమేష్ పై 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకంలో జరిగిన అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా విచారణ జరిపి రెండు వార్షిక ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు పాటించకుండా రెస్కో లో నియామకాలు చేయడం, అభ్యర్థులను సక్రమంగా ఎంపిక చేయకపోవడం, నిర్దేశించిన విధానాలను అనుసరించకపోవడం, సరైన అనుమతి లేకుండా ముగ్గురు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను కొనసాగించడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. విచారణ అధికారి అభియోగాలు రుజువు అయినట్టు నిర్ధారించారు. ప్రభుత్వం విచారణ నివేదిక, వివరణలు, రక్షణ వాదనలను పరిశీలించి, సంబంధిత అధికారి వాదనలను తిరస్కరించింది. ఈనెల 20న జి.ఓ.ఆర్.టి.నెం. 1073,  ద్వారా ప్రభుత్వం పూర్వపు ఎమ్ డి పి. రమేష్ పై రెండు వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లను సంచిత ప్రభావంతో  నిలిపివేసే శిక్షను విధించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సహకార సంఘాల కమిషనర్, రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ...... ఎమ్ డి పై చర్యతో సరేనా....విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలుండవా...? ఎట్టకేలకు అక్రమాలు జరిగిన ఆరేళ్ల తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్ఈసిఎస్ అప్పటి  మేనేజింగ్ డైరెక్టర్, ప్రస్తుతం  జిల్లా సహకార అధికారి పిల్లి రమేష్ మీద ఉన్న ఆరోపణల్లో  ఉద్యోగ నియామకంలో అవకతవకలకు సంబంధించి రెస్కో లో 59 ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీలో నిబంధనలు, రిజర్వేషన్ పాటించలేదు. టెక్నికల్ టెస్ట్ లో భాగంగా పోల్ క్లైంబింగ్, సైక్లింగ్, మీటర్ రీడింగ్ వీడియో తీసినా సేవ్ చేయలేదు, 10వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని వదిలేసి, తక్కువ మార్కులు వచ్చిన వారిని సెలెక్ట్ చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. అలగే  రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించడంలో ముగ్గురు 3 మంది విశ్రాంత ఉద్యోగులను తిరిగి నియమించడానికి రాష్ట్ర సహకార కమీషనర్, సహకార సంఘాల శాఖాధికారులు  తిరస్కరించినా, ఆయన వారి సేవలను కొనసాగించారు. ఈ ఆరోపణలుపై  విశాఖపట్నం జిల్లా సహకార అధికారి  T. ప్రవీణ  విచారణ అధికారిగా విచారణ జరిపారు.  ఆరోపణలూ రుజువు అయ్యాయని నివేదిక ఇచ్చారు. ఆరోపణలు నిజం కాదంటూ పి రమేష్  దీనిని ఖండిస్తూ, ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని, రెస్కో అనేది ప్రాథమిక సహకార సంఘం అని వివరణ ఇచ్చినా ప్రభుత్వం దీనిని తిరస్కరించింది.  ఆర్థిక నష్టం జరగకపోయినా, నిబంధనలు తప్పడం, మెరిట్‌ను తొక్కడం, ఉన్నతాధికారుల తిరస్కరణ ఉత్తర్వును ధిక్కరించడం అనేది తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘన అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు  వార్షిక ఇంక్రిమెంట్లను సంచిత ప్రభావంతో  నిలిపివేయడం అంటే ఆయనకు రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి, అది ఆయన జీతం మీద, భవిష్యత్తు పెన్షన్ మీద కూడా శాశ్వత ప్రభావం చూపుతుంది.
ఈ ఉత్తర్వును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రాష్ట్ర సహకార సంఘాల శాఖ అధికారులకి అప్పగించారు. అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఇక ఉద్యోగాలు పొందిన వారిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.