14 ఏళ్లుగా బానిస బతుకు.. చివరకు అధికారుల చొరవతో విముక్తి
జలదంకి, మేజర్ న్యూస్ :-
జలదంకిలో పనిచేసుకుంటున్న తమను ఇటుకల పని కోసం తీసుకెళ్లి 14 ఏళ్లుగా వెట్టిచాకిరి చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.కమలాపూర్‌లో సిమెంట్ ఇటుకలు, రింగుల పని చేయిస్తూ వారానికి కేవలం రూ.600 మాత్రమే ఇచ్చేవారని వారు తెలిపారు. యజమాని ఆర్మూరు శివకుమార్ తమ పేరు మీద అప్పులు, రుణాలు వేసి గొంతుకు వచ్చేలా చేశాడని ఆరోపించారు.ఎదురుతిరిగి మాట్లాడితే కొట్టి చిత్రహింసలు పెట్టేవారని, బయటకు చెప్పుకోలేక భయంతోనే గడిపామని బాధితులు కన్నీటితో చెప్పారు. ఏడాదికి ఒకసారి లేదా కొన్ని నెలలకు ఒకసారి వచ్చి పని చేయించుకునేవారని, పెళ్లిళ్లు కూడా అక్కడే చేశారని వెల్లడించారు.14 ఏళ్లుగా ఎంతో ఇబ్బంది పడుతూ, అల్లాడిపోతూ బానిస బతుకు గడిపామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలు చెప్పుకోగా అధికారులు బయటకు తీసుకొచ్చి న్యాయం చేశారని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.