ప్రతిభకు ప్రోత్సాహం.. కలలకు చేయూత!
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్; జీ టీవీ 'సరిగమప' సింగింగ్ రియాలిటీ షోలో సుమారు 3,000 నుండి 5,000 మంది పోటీదారుల తీవ్ర పోటీని తట్టుకుని, తన అద్భుతమైన గాత్రంతో టాప్-10 స్థానంలో నిలిచిన ప్రతిభావంతురాలైన యువ గాయనికి హృదయపూర్వక అభినందనలు. అయితే, ఎలాంటి సిఫారసులు లేకపోవడం వల్ల ఆమె ప్రతిభ ఉన్నప్పటికీ మరింత ముందుకు వెళ్లలేకపోయిన విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వ్యవస్థాపకులు, ధర్మ రక్ష, చైర్మన్, శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయం, సైదాబాద్ డా. చికొటి ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించారు.
ఆ యువ గాయనిని తన కార్యాలయానికి ఆహ్వానించి శాలువాతో సత్కరించి, ఆమె సంగీత ప్రయాణానికి, ఉజ్వల భవిష్యత్తుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా డా. చికొటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. "ప్రతిభ ఉన్న కళాకారులకు సరైన అవకాశాలు రావడానికి ఎవరి సిఫారసులు అవసరం లేదు. కేవలం టాలెంట్ ఆధారంగానే వారికి గుర్తింపు దక్కాలి. ఈ సింగర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నా వంతు పూర్తి సపోర్ట్ అందిస్తాను" అని స్పష్టం చేశారు. తన ప్రతిభను గుర్తించి, భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న చికొటి ప్రవీణ్ కుమార్‌కు ఆ సింగర్ మరియు ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.