ఘనంగా హోంమంత్రి అమిత్ షా 62వ జన్మదిన వేడుకలు
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : దేశ హోం మంత్రి అమిత్ షా 62వ జన్మదిన వేడుకలు రాష్ట్రీయ అమిత్ షా యువ సంఘటన్ అధ్యక్షుడు ఆర్. విక్రం నాథ్ ఘనంగా నిర్వహించారు. గురువారం హైదర్గూడా ఎన్ఎస్ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేక్ ను కట్ చేసి మీడియా ప్రతినిధులు, అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశానికి అమిత్ షా పునాది లాంటివాడని కొనియాడారు. ప్రధాని మోడీ, అమిత్షాల నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తుందని చెప్పారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ జాతీయ పార్టీ బిజెపిని సమర్థవంతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలలో పర్యటించి యువకులను చైతన్య పరుస్తామని అన్నారు. బండ్లగూడ జాగీర్ లో దాదాపు 1500 మందికి భోజన సదుపాయాలను కల్పించామని తెలిపారు. హోం మంత్రిగా అమిత్ షా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.