BREAKING
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్.. నగరాలకు వలసల వెనుక దాగివున్న ఆర్థిక భారం టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్!

చీర చంద్రమౌళి ఆధ్వర్యంలో వెలిమెలలో సందడి.. -ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాపురం నరసింహ రెడ్డి

Select Suryaa Now
చీర చంద్రమౌళి ఆధ్వర్యంలో వెలిమెలలో సందడి..   -ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాపురం నరసింహ రెడ్డి

పటాన్ చెరు;పండుగ అంటే కేవలం సంబరాలు మాత్రమే కాదు ఆత్మీయులను కలిపే అనుబంధాల వేడుక దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని వెలిమెలలో నిర్వహించిన ఆలై-బలై కార్యక్రమం స్నేహబంధాలు, ఆత్మీయ పలకరింపులు, పండుగ శుభాకాంక్షలతో సందడిగా సాగింది. చీర చంద్రమౌళి ఆధ్వర్యంలో వెలిమెలలోని దుర్గ శంకర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, వేడుకల్లో పాల్గొని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో ఫంక్షన్ హాల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. నిత్య జీవితంలో పనుల ఒత్తిడితో బిజీగా గడిపే స్నేహితులు, బంధువులు ఇలాంటి వేడుకల ద్వారా ఒకచోట చేరి తమ అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ, పరస్పర ప్రేమాభిమానాలను చాటిచెప్పే ఆలై-బలై కార్యక్రమం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తూ,ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకతో పాల్గొన్న వారంతా పండుగ సంతోషాలను పరస్పరం పంచుకున్నారు.