బహుజన ఆత్మగౌరవానికి దక్కిన చారిత్రాత్మక గుర్తింపు: గట్టుప్పల్ కురుమ సంఘం నాయకులు లక్ష్మణ్ కురుమ
బహుజన ఆత్మగౌరవానికి దక్కిన చారిత్రాత్మక గుర్తింపు: గట్టుప్పల్ కురుమ సంఘం నాయకులు లక్ష్మణ్ కురుమ????ట్యాంక్‌బండ్‌పై దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటు నిర్ణయం హర్షణీయంమునుగోడు,మేజర్ న్యూస్:తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, బహుజన వీరత్వానికి ప్రతీక దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం బహుజన ఆత్మగౌరవానికి దక్కిన గొప్ప గుర్తింపు అని ఘట్టుప్పల్ కురుమ సంఘం నాయకులు బాలేం లక్ష్మణ్ కురుమ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య పేరు తెలంగాణ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. భూస్వామ్య దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన ఆయన, అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం తెలంగాణ చరిత్రలో బహుజనుల పాత్రకు తగిన గుర్తింపు కల్పించే దిశగా కీలక అడుగని అన్నారు.దొడ్డి కొమురయ్యకు సముచిత గౌరవం కల్పించాలనే అంశాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. చరిత్రలో మరుగునపడిన బహుజన వీరుల త్యాగాలను వెలుగులోకి తీసుకురావడం, వారి సేవలను సమాజానికి పరిచయం చేయడం సామాజిక చైతన్యానికి దోహదపడుతుందని చెప్పారు.విగ్రహం ఏర్పాటు అంటే కేవలం ఒక ప్రతిమను ప్రతిష్ఠించడం మాత్రమే కాదు.. ఒక మహనీయుడి పోరాట స్ఫూర్తిని, ఆయన ఆశయాలను, సమాజం కోసం చేసిన త్యాగాలను తరతరాలకు చాటిచెప్పడం అని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తంమీద ఈ పరిణామం తెలంగాణ (నల్లగొండ జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.