BREAKING
పత్రికా ప్రకటన అనుమతులు లేని సైనిక్‌, నవోదయ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను అమలు చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌ అన్నమయ్య జిల్లా – మదనపల్లె: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ తదితర కోచింగ్‌ సెంటర్లపై తక్షణమే చర్యలు త నెల్లిమర్ల నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల నిరసన గళం..... రిటైర్మెంట్ బెనిఫిట్లు, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా! అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు సీతాగొర్లె వాణిపాలెంలో అంబరాన్నంటిన దుర్గమ్మ అంబలం పూజలు

యువత వ్యాపార రంగంలోకి రావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు, స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్

Select Suryaa Now
యువత వ్యాపార రంగంలోకి రావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు, స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్
సూర్య జైనూర్ : యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా, స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు, స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ పిలుపునిచ్చారు. యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ఆర్థికంగా ఎదగడంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడగలరని వారు పేర్కొన్నారు.జైనూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న వ్యాపారంతో ప్రారంభించి, క్రమంగా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చని తెలిపారు.యువత స్వయం ఉపాధి సాధిస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగవచ్చని వారు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగేవారికి పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం, వినియోగదారుల పట్ల నమ్మకం ఎంతో ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సహకార సంఘం చైర్మన్ కొడప హనుపటేల్,మాజీ కో ఆప్షన్ అఫ్రోజ్,సీనియర్ నాయకులు మెస్రం అంబాజీ రావ్, జిల్లా మైనార్టీ నాయకులు రహీమ్, డాక్టర్ గోపీనాథ్,చాంద్ భాయ్, ఆసిఫ్, మహిముద్, ఫ్రిరోజ్,మరియు వ్యాపార సంస్థ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.