BREAKING
కారులో 22 కిలోల గంజాయి మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ! ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అజేయ ప్రస్థానానికి 48 వసంతాలు! ‘గరివిడి లక్ష్మి’ గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది బయోపిక్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం ఆస్కార్స్ 2027 రేసులో నాగాలాండ్ చిత్రం ‘అంగ్’: కొత్త నిబంధనలతో నేరుగా అర్హత సాధించిన వైనం ఆర్‌బిఐ సంచలన నిర్ణయం ఆగష్టు 26 భోటేకోశి-త్రిశూలి విపత్తు అధ్యయనం కోసం 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన నేపాల్ సింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాక్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే భారీ ప్రాజెక్ట్ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూత ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి

స్వచ్ఛ రిక్షాల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలి

Select Suryaa Now
స్వచ్ఛ రిక్షాల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలి

 

తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి::

 
నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చెత్త సేకరణ కోసం కార్మికులకు పంపిణీ చేసిన స్వచ్ఛ రిక్షాల కొనుగోళ్లలో నాణ్యత లోపాలపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా రిక్షాలను పంపిణీ చేసినప్పటికీ, కొన్ని రిక్షాలకు ముందుగానే టైర్లు, ట్యూబులు, తాళాలు, చైన్లు లేకపోవడంతో కార్మికులు తమ సొంత డబ్బులతో మరమ్మతులు చేయించుకున్నారని ఆరోపించారు.
ప్రజాధనంతో కొనుగోలు చేసిన రిక్షాలు కార్మికులకు అందకముందే మరమ్మతులకు గురికావడం కొనుగోళ్ల నాణ్యతపై అనుమానాలకు తావిస్తోందన్నారు. రిపేర్ ఖర్చులను కూడా కార్మికులపైనే వేయడం సరికాదని పేర్కొన్నారు. నాణ్యత లేని రిక్షాల కొనుగోళ్లపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులపై రిపేర్ భారం మోపకుండా వారికి నాణ్యమైన రిక్షాలు అందించడం నగర పాలక సంస్థ బాధ్యత అని హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.