వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
సూర్య, వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ఇప్పటికే పూర్తైన పనులు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం, శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.