సిరిసిల్లలో విషాదం..చెరువులో మునిగి వ్యక్తి మృతి
సూర్య రాజన్న సిరిసిల్ల:చేపలు,తాబేళ్ల వేట కోసం చెరువులోకి దిగిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందిన విషాద ఘటన వెంకటాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.వెంకటాపూర్ కు చెందిన మోతే ఎల్లయ్య,ఎల్లవ్వ దంపతుల కుమారుడు మోతే కిరణ్ (35) శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. నీటిలోకి దిగిన క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగిపోయాడు.స్థానికులు, కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు.శనివారం ఉదయం చెరువులో నుంచి కిరణ్ మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కిరణ్ తో ఉన్న స్నేహితుల ప్రవర్తనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మృతుడికి భార్య సుమ,ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అర్ధాంతరంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.