BREAKING
పత్రికా ప్రకటన అనుమతులు లేని సైనిక్‌, నవోదయ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను అమలు చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌ అన్నమయ్య జిల్లా – మదనపల్లె: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ తదితర కోచింగ్‌ సెంటర్లపై తక్షణమే చర్యలు త నెల్లిమర్ల నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల నిరసన గళం..... రిటైర్మెంట్ బెనిఫిట్లు, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా! అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు సీతాగొర్లె వాణిపాలెంలో అంబరాన్నంటిన దుర్గమ్మ అంబలం పూజలు

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి - ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

Select Suryaa Now
ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి - ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు
 
 సూర్య ఉట్నూర్ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి  మంద మకరందు అధికారులను ఆదేశించారు.సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ాదిగూడ మండలం లొద్దిగూడ గ్రామానికి చెందిన కొడప కన్ను తనకి బావి మరియు బీటీ రోడ్డు మంజూరు కల్పించామని సిరికొండ మండలం రాయిగూడ గ్రామానికి చెందిన కోసేరావు తనకి ఏదైనా గురుకులంలో ఉద్యోగం కల్పించమని గుడిహత్నూరు మండలం సోయంగూడ గ్రామానికి చెందిన చంపత్రావు తనకి విద్యుత్ కనెక్షన్ బోర్వెల్ ఇప్పించమని చూడమండలం దుబాయ్ గ్రామానికి చెందిన కార్లే సంధ్య తనకి ఏదైనా ఫార్మర్సిస్ట్ ఉద్యోగం ఇప్పించమని కొరకు దరఖాస్తు అందజేసారు,అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.