BREAKING
అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం ఖాయం తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ (PGRS ) సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ అధికారిక ప్రకటన రాలేదు తెలంగాణలో 41 కొత్త బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

హైదరాబాద్‌లోని మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

Select Suryaa Now
హైదరాబాద్‌లోని మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

అపార్ట్‌మెంట్‌లో చొరబడి దొంగతనం, మహిళపై దాడికి యత్నం
సూర్య క్రైమ్ డెస్క్: హైదరాబాద్ నగరం మణికొండ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తీవ్ర అలజడి సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో స్థానిక ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లోకి ఆరుగురు సభ్యులతో కూడిన ఆయుధధారులైన దుండగుల ముఠా చొరబడింది. అపార్ట్‌మెంట్ సమీపంలోని లేక్‌సైడ్ వద్ద ఉన్న రక్షణ ఫెన్సింగ్‌ను పదునైన పరికరాలతో కత్తిరించి భవనం ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం సి బ్లాక్‌లోని ఒక ఫ్లాట్ తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు దొంగతనానికి ఒడిగట్టారు.

ఇంట్లో శబ్దాలు రావడంతో మేల్కొన్న ఒక మహిళ దొంగలను నిరోధించేందుకు ప్రయత్నించింది. అయితే దొంగతనానికి వచ్చిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు తమ వద్ద ఉన్నారణ ఆయుధాలతో ఆ మహిళపై దాడికి తెగబడ్డారు. దాడి యత్నం నుంచి ఆమె చాకచక్యంగా తప్పించుకుని బిగ్గరగా కేకలు వేయడంతో, అపార్ట్‌మెంట్ వాసులు మేల్కొనే ప్రమాదముందని భావించిన దుండగులు అక్కడ లభించిన విలువైన వస్తువులతో పరారయ్యారు. అర్ధరాత్రి వేళ ఆయుధాలతో ముఠా సభ్యులు సంచరించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్లలో తీవ్ర భయాందోళనలను నింపాయి.

ఘటనపై సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించగా చెడ్డీ గ్యాంగ్ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులు సంచరించినట్లు స్పష్టమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు, త్వరలోనే ముఠాను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.