BREAKING
అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం ఖాయం తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ (PGRS ) సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ అధికారిక ప్రకటన రాలేదు తెలంగాణలో 41 కొత్త బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

ఘనంగా షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు.

Select Suryaa Now
ఘనంగా షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు.

క్యాంపు కార్యాలయణలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

సూర్య కరీంనగర్ ప్రతినిధి:షహీద్ భగత్ సింగ్ ఆశయాలు... నేటి యువతరానికి మార్గదర్శకం అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరలోని తీగలగుట్ట పల్లి మేయర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ భగత్ సింగ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాతృభూమి విముక్తి కోసం భగత్ సింగ్ చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మాతృభూమి విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు షహీద్ భగత్ సింగ్ అన్నారు. చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన త్యాగం, దేశభక్తి ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాధంతో దేశ యువతలో స్వాతంత్ర్య ఆంక్షను రగిలించిన గొప్ప పోరాట యోదుడన్నారు. 23 సంవత్సరాల వయస్సులోనే మాతృభూమి విముక్తి కొసం ఆయన చేసిన త్యాగం  చిరస్మరణీయమైందన్నారు. నేటి యువత భగత్ సింగ్ చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి, సమాజ సేవకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నిఫా రాష్ట్ర కో ఆర్డినేటర్ కే. యాదవ రాజు, బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.