BREAKING
సమాజం నమ్మకపోయినా మనపై మనకు నమ్మకం ఉండటమే అసలైన శక్తి.. దసరా వేళ రియా చక్రవర్తి భావోద్వేగ వ్యాఖ్యలు! అమెరికా మధ్యంతర ఎన్నికల వ్యూహం క్లీన్ ఎనర్జీ వైపు అభివృద్ధి చెందుతున్న దేశాల వేగవంతమైన అడుగులు ఏఐ ఒక్కటే ఆసియా మార్కెట్లకు ఆధారం కాదు చల్లూరులో ఫ్లెక్సీ చించివేతతో రాజకీయ దుమారం! ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు ఆర్థో విభాగంలో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న వైద్యులు, సిబ్బంది ఆస్ట్రేలియా కార్పొరేట్ రంగంలో భారీ డీల్ రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' షూటింగ్ విశేషాలు వెల్లడించిన నటుడు అదినాథ్ కోఠారే! తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎర్రగుడి రేష్మ పర్వీన్ మైనార్టీ వర్గాలలో ప్రత్యేక గుర్తింపు.… ఆదివారం చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం.. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన విద్యావంతురాలు ప్రజావాణిలో ఖాళీ కుర్చీలు.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం…! న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ వాషింగ్టన్ గోల్ఫ్ కోర్సు పునరుద్ధరణ నిర్లక్ష్యానికి గురైన దుర్గమ్మ ఆలయం.. ఉక్రెయిన్‌కు అమెరికా బిగ్ రిలీఫ్ శ్రీ మహిషాసుర మర్దిని దేవి – దుర్గాదేవి అవతారం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం

ఎదురుగడ్డలో యువకుడి దారుణ హత్య - విచక్షణారహితంగా దాడి

Select Suryaa Now
ఎదురుగడ్డలో యువకుడి దారుణ హత్య - విచక్షణారహితంగా దాడి

సూర్య,కొత్తగూడెం క్రైమ్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో యువకుడు ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో యువకుడిని దారి కాచి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. యువకుడి ఒంటిపై 15 కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. చనిపోయిన యువకుడు అఖిల్ (21)గా గుర్తించారు. అఖిల్ ఎదురుగడ్డలోని స్థానికంగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉంటున్న యువకులు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల ఆధిపత్య పోరులో అఖిల్ ను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడిపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సంఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.  ఆదివారం అర్ధరాత్రి అఖిల్ కి స్థానిక యువకులకు మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ హత్య జరగడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని పలువురు భావిస్తున్నారు.

సూర్య రిపోర్టర్ సర్వేష్ కొత్తగూడెం క్రైమ్