బందగి మరణం తీరనిలోటు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. డిండి. మేజర్ న్యూస్ : బంధకి అకాల మరణం వారి కుటుంబానికి స్థానిక పార్టీకి తీరనిలోటని దాన్ని ఎవరూ పూడ్చలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్
బందగి మరణం తీరనిలోటు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. డిండి. మేజర్ న్యూస్ : బంధకి అకాల మరణం వారి కుటుంబానికి స్థానిక పార్టీకి తీరనిలోటని దాన్ని ఎవరూ పూడ్చలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యములు అన్నారు. ఈ మధ్యకాలంలోనే రోడ్డు ప్రమాదంలో బందగి మరణించిన సంగతి అందరికీ విధితమే, సోమవారం వారు డిండి మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో జరిగిన బందగి సంస్మరణ సభలో ముఖ్య నాయకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బందగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బందగి అకాల మరణం అతని కుటుంబాన్ని తీవ్రంగా కలిసి వేసిందని , ఆ బాధ నుండి త్వరగా కోలుకోవాలని కోరారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు పల్ల నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకురాలు పశ్యపద్మ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు, జిల్లా నాయకులు దేవేందర్ రెడ్డి ,జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు వెంకటరమణ,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్, దేవరకొండ మండల కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, డిండి మండల నాయకులు శైలేష్, విజేందర్ ర్రెడ్డి, రవీంద్ర శర్మ, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు శ్రీను, వెంకులు, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.