BREAKING
ఓటు హక్కు పరిరక్షణ పోరాటానికి ఢిల్లీకి బషీరాబాద్ కాంగ్రెస్ నాయకులు అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా తిరుపతి, పుంగనూరు, శ్రీకాళహస్తి ఘటనలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు. గవర్నర్ కార్యాలయనికి నివేదిక సమర్పించిన రాష్ట్ర ఎన్నికల సంఘం బెండకాయ నీరు తాగితే నిజంగానే బరువు తగ్గొచ్చా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే! పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! టీమిండియాకు షాక్.. తొలి వన్డే తర్వాత జట్టు నుంచి నితీశ్ కుమార్ రెడ్డి రిలీజ్! భారీ లక్ష్యాల ఛేజింగ్‌లో తడబడుతున్న అభిషేక్ శర్మ.. ఆశ్చర్యకరమైన గణాంకాలు వెల్లడి! ఇండియా ఏ జట్టులో యశస్వి జైస్వాల్ డకౌట్.. హాఫ్ సెంచరీతో రాణించిన దేవదత్ పడిక్కల్! ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ షురూ! ఎంజీఆర్ బయోపిక్ లో జయలలిత పాత్రలో త్రిష.. త్వరలో సెట్స్ పైకి ప్రతిష్టాత్మక చిత్రం! హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటిన పీవీ సింధు, లక్ష్యసేన్.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత షట్లర్లు! ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసిన తపాలా శాఖ శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ప్రతి యాత్రికుడికి ₹2 లక్షల ఉచిత ప్రమాద బీమా: మూడు నగరాల్లో 21 వేలకు పైగా చిరు వ్యాపారులను అనుసంధానించిన 'డిజిదూకాన్' పరిశోధనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చాలని పిలుపునిచ్చిన రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్

చరిత్ర సృష్టించిన మనీషా బన్వాలా

Select Suryaa Now
చరిత్ర సృష్టించిన మనీషా బన్వాలా

సూర్య క్రీడా డెస్క్: అంతర్జాతీయ కుస్తీ రంగంలో భారతదేశం తరఫున ఒక సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రపంచ కుస్తీ ఛాంబియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ మనీషా బన్వాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచి సరికొత్త మైలురాయిని తాకారు. ఉత్కంఠభరితంగా సాగిన మహిళల 59 కేజీల విభాగం ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన అబిగైల్ ఎలిజబెత్ నెట్టెపై సంచలన విజయం సాధించి దేశానికి తొలిసారిగా ప్రపంచ ఛాంబియన్ హోదాను తెచ్చిపెట్టారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత మహిళా రెజ్లింగ్ చరిత్రలో స్వర్ణ పతకం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో అమెరికా రెజ్లర్ దూకుడుగా ఆడి 6-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినప్పటికీ, మనీషా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అద్భుతమైన పోరాట పటిమను కనబరుస్తూ వరుస పాయింట్లు సాధించి మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. ఆరంభంలో వెనుకబడినప్పటికీ చివరి క్షణాల్లో అత్యుత్తమ టెక్నిక్‌ను ప్రదర్శించి 8-6 తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ అపూర్వ విజయంతో రెజ్లింగ్ దిగ్గజం సుశీల్ కుమార్ తర్వాత సీనియర్ ప్రపంచ ఛాంబియన్‌షిప్‌లో స్వర్గం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా, అలాగే తొలి మహిళా రికార్డును మనీషా తన పేరు మీద నలుపుకున్నారు.

ఈ టోర్నమెంట్లో భారత మహిళా రెజ్లర్ల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మనీషా సాధించిన చారిత్రాత్మక స్వర్ణంతో పాటు కాజల్ ధోచక్, నీలం సిరోహి రజత పతకాలు సాధించగా, తను శర్మ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తంగా నాలుగు పతకాలతో భారత మహిళా జట్టు ఈ మెగా టోర్నమెంట్‌ను విజయవంతంగా ముగించింది. కఠినమైన సాధన, తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా అడుగులు వేసిన మనీషా విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ కురుస్తోంది.

భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈ విజయం రాబోయే తరాల మహిళా అథ్లెట్లకు ఎంతో స్ఫూర్తినిస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడిని జయించి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన మనీషా భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.