BREAKING
పాక్ సిరీస్‌పై సినీ కార్మిక సంఘం అల్టిమేటం: ఆ సిరీస్ ఆపకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్ చేస్తామని హెచ్చరిక 14వ జేడీసీసీ సమావేశంలో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన భారత్, యూఏఈ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు కేరళ, మిజోరం, నాగాలాండ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఐఓఆర్ఏ మంత్రివర్గ సమావేశానికి ముందు శ్రీలంక జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ: సభ్యుడిగా అల్లు అరవింద్ నియామకం సామాజిక న్యాయం కోసం ఢిల్లీకి మాజీ ఎంపీ తలారి రంగయ్య ‘బాల 369’ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిఖిల్ సిద్ధార్థ ప్రశంసలు సిద్ధార్థ్ దత్తాతో హీరోయిన్, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి వివాహం: వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు గేదెల్లంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన నాయకులు గుద్దటి జమ్మి గారి సతీమణి శ్రీమతి కాశీ తులసి రత్నం ఘన విజయం థియేటర్లలో శర్వానంద్ ‘భోగి’: సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే? నాన్న కుట్టి మూవీ రివ్యూ: విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పించిందంటే? పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? సూపర్ మార్కెట్ షాపింగ్ ఇక మీ చేతిలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ‘సేల్స్ బీజ్’ యాప్ మరియు టెర్రాన్ ఈవీ స్కూటర్ల ప్రారంభం యథార్థ సంఘటనల ఆధారంగా ‘కూల్ రాఖీ కూల్’: ఘనంగా పోస్టర్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’: సక్సెస్ మీట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న చిత్ర బృందం

ది ప్యారడైజ్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్.. తుఫాన్‌లాంటి రెస్పాన్స్ వస్తోంది: నాని, మోహన్ బాబు!

Select Suryaa Now
ది ప్యారడైజ్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్.. తుఫాన్‌లాంటి రెస్పాన్స్ వస్తోంది: నాని, మోహన్ బాబు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన తాజా సంచలన చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా గ్రాండ్‌గా మీడియా ములాఖాత్ (సక్సెస్ మీట్) నిర్వహించింది. ఈ వేడుకలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు నటులు ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొని సినిమా విజయంపై తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ప్రేక్షకుల నుంచి తుఫాన్‌లాంటి రెస్పాన్స్ వస్తోంది - హీరో నాని

మీడియా ములాఖాత్‌లో నాని మాట్లాడుతూ.. "ఈ సినిమా విషయంలో ప్రతీదీ చాలా కొత్తగా జరిగింది. ఫిలిం మేకింగ్ నుంచి రిలీజ్ వరకు అన్ని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అయిన రోజు ఉదయం పాజిటివ్‌గా ఉండి, సాయంత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్‌గా మారడం చూస్తున్నాం. కానీ ‘ప్యారడైజ్’కి మాత్రం రివర్స్‌లో ప్రతి షోకి పాజిటివిటీ పెరుగుతూ వస్తోంది. ఎవర్ని కలిసినా, ఎక్కడికి వెళ్లినా ఒకటే టాపిక్.. అదే ‘ప్యారడైజ్’ గెలుపు. ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఒక తుఫాన్‌లా అనిపించింది. ప్రేక్షకులు తమ సొంత సినిమాగా ఓన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, వర్షంలో, బురదలో నిద్రలేకుండా కష్టపడిన ప్రతీ జూనియర్ ఆర్టిస్ట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్ అసలైన రియల్ హీరోస్. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మోహన్ బాబుగారితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. ఆయన ఈ సినిమాకి మరో పెద్ద హీరో" అని పేర్కొన్నారు.

నా కెరీర్‌లో ఇలాంటి భయంకరమైన పాత్ర ఎప్పుడూ చేయలేదు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

ఈ చిత్రంలో కీలకమైన 'సికంజ మాలిక్' పాత్రలో నటించిన మోహన్ బాబు మాట్లాడుతూ.. "నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో 500లకు పైగా సినిమాలు చేశాను కానీ, సికంజ మాలిక్‌లాంటి భయంకరమైన పాత్ర చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్. నన్ను అంత పవర్‌ఫుల్‌గా చూపిస్తాడని నేను కూడా ఊహించలేదు. నా గురువు దాసరి నారాయణరావుగారు ఎలా అయితే నమ్మకంతో ఎక్కువ టేకులు తీసుకునేవారో, దర్శకుడు శ్రీకాంత్ కూడా నాతో అలాగే పనిచేశారు. శ్రీకాంత్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్, త్వరలోనే దేశంలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు. నిర్మాత సుధాకర్ ఎక్కడా డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. నాని ఈ సినిమా కోసం పడిన కష్టం ఆ దేవుడికే తెలుసు. జడలు వేసుకొని, యాక్షన్ చేయడం మామూలు విషయం కాదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది" అని అభినందించారు.

శ్రీకాంత్ ఓదెల మరియు నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ..

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. "సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మోహన్ బాబుగారితో పనిచేయడం నా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. నాని అన్నతో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమా విజయం వెనుక ప్రతి ఒక్కరి కష్టం ఉంది" అని అన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా మా టీమ్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు.

ఈ వేడుకలో పాల్గొన్న నటులు ప్రియదర్శి (శంకరన్న పాత్ర), సంపూర్ణేష్ బాబు తదితరులు తమ పాత్రలకు వస్తున్న అద్భుతమైన స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం థియేటర్లలో ‘ప్యారడైజ్’ మేనియా కొనసాగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.