BREAKING
తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి

వెల్దుర్తిలో ఘనంగా ‘పోషణ్ మాహ్’, అంగన్వాడీ ఉత్సవం

Select Suryaa Now
వెల్దుర్తిలో ఘనంగా ‘పోషణ్ మాహ్’, అంగన్వాడీ ఉత్సవం

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ మండల  పరిధిలోని వెల్దుర్తి-6, ఎల్.బండ, ఆలంకొండ-4, పేదొడ్డి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ‘పోషణ్ మాహ్’, అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు పద్మావతి, సరస్వతమ్మ, సుగుణమ్మలను అంగన్వాడీ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో సూపర్వైజర్లు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు పంపిణీ చేస్తున్న టేక్ హోమ్ రేషన్ (THR) ఉత్పత్తులను లబ్ధిదారులు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు అన్ని రకాల పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. హెల్త్ సూపర్వైజర్ మాట్లాడుతూ.. తల్లులు తమ పిల్లలకు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయించాలని తెలిపారు.

బాల్య వివాహాలతో అనేక సమస్యలు:

డిసిపియు ప్రతినిధి గీతావాణి మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. రామళ్లకోట డాక్టర్, హెల్త్ సూపర్వైజర్లు మోహన్, హనమ్మ మాట్లాడుతూ పసిపిల్లలకు సరైన సమయంలో టీకాలు వేయించడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచించారు.

అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్‌ను అధికారులు, గ్రామస్థులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌కే షమీనా బేగం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి, లక్ష్మి, కిషోర్, సావిత్రిబాయి, సురేఖ, ఆయా శాంతమ్మ, చిన్నబాబు, గర్భవతులు, బాలింతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం