ట్రాక్టర్ టాపును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
వింజమూరుమేజర్ న్యూస్ : వింజమూరు కావలి బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వీట్ కవరింగ్ వర్క్స్ దుకాణం వద్ద తయారు చేసిన ట్రాక్టర్ టాప్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు దుకాణ యజమాని దాసరి ప్రసాద్ తెలిపారు ఆదివారం రాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం వద్ద మద్యం సేవించి వాటినొక్కడే వదిలేసి ట్రాక్టర్ టాప్ ను ధ్వంసం చేసి వెళ్లినట్లు బాధితుడు వాపోయారు దీని విలువ సుమారు 5000 రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.