BREAKING
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు.

*స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం....

Select Suryaa Now
*స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం....

విజయనగరం బ్యూరో,  సూర్య : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లిమర్ల నగర పంచాయతీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కూటమి నాయకులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా విజయనగరంలో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్, కౌన్సిలర్ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక

నెల్లిమర్ల నగర పంచాయతీపై కూటమి జెండా ఎగురవేయాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, కూటమి విజయానికి కృషి చేయాలని సూచించారు.

ఐక్యంగా పనిచేయాలని పిలుపు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకుల మధ్య పరస్పర సహకారం ఎన్నికల్లో కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు. చైర్మన్ స్థానంతో పాటు కౌన్సిలర్ స్థానాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు సువ్వాడ రవిశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు కడగల ఆనందకుమార్, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, జనసేన నాయకులు లోకం ప్రసాద్, రవ్వ నాని తదితరులతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, వార్డు ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.