సంస్క్రుతి,చరిత్రలను తెలిపేవి బొమ్మలు కొలువులు
అక్టోబర్, సూర్య : భారతీయ సనాతన సాంప్రదాయాలలో బొమ్మలకొలువులకు ప్రత్యేకత ఉంది.దసరామహోత్సవాలు, భోగి, సంక్రాంతి పండుగలలో జరుగు వేడుకల లో ఆబాలగోపాలాన్ని ఆకర్షించేవి బొమ్మలు కొలువులు. ఇది కొందరి ఇళ్ళల్లో నేటికి ఆచారంగా కొనసాగుతుంది .అందంగా ఒక క్రమంలో ప్రత్యేక బల్లలపై,చిన్న చిన్న ఇసుకతిన్నెలపై అమర్చిన బొమ్మలు ఇవి, మానవ, జంతు, వాద్య, చారిత్రక కట్టడాలు, నాటి, నేటి వాహనాలు, రహదారులు, ఆధ్యాత్మిక, విద్యాలయాలు, దేవతల బొమ్మలు,అనుమానంగా జరుగుతున్న తిరునాళ్ళు, పైడితల్లి అమ్మవారి సిరిమాను, అంజలి, రథం, పాలధార, లైట్ హౌస్, మూడు లాంతర్లు, బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపులు ఎన్నో ఎన్నెన్నో... ప్రతి బొమ్మ మననుపలుకరిస్తాయాఅన్నట్లుఉంటాయి.ప్రతివిద్యాలయం మనలోజ్నాపకాలను గుర్తు తెస్తాయి.మనం చూడని, తెలియని విషయాలు సుమారు ఒక గంట లోపే వీటి గురించి బొమ్మలు చరిత్ర పిల్లలు, పెద్దలు మనకుతెలియజేస్తారు.మూడునుండి9రోజులపాటు గ్రుహాలలో సనాతనాచారాలుపాటిస్తూ ఏర్పాటు చేసి సాయంత్రం వేళల్లో ముత్తయిదువలకు తాంబూలం సత్కారాలు, చిన్నారులకు మిఠాయిలుపంచుతూ జరిగే వేడుక ఇది. మనదేశంలో పలుప్రాంతాల్లో ఉన్నా విదేశాలలకూడా వలస వెళ్ళినవారు మనసంస్క్రుతిని భావితరాలకు తెలియజేయడం ముదావహం. విజయనగరం పట్టణంలోని తోట పాలెం నివాసి విశ్రాంత ఉపాధ్యాయుడు సూక్తులు రామకృష్ణ ప్రతిఏటా పాత బొమ్మలే కాదు. అభ్యుదయభావాలు, నేటి సామాజిక సమస్యల చిత్రాలు - ఆరోగ్యం, విద్య, వైద్యం ఆవశ్యకతలను తెలుపేందుకు తన సమయాన్ని బొమ్మలు రూపకల్పనకు కేటాయిస్తారు.వారిగ్రుహంలో చాలా ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ప్రతి బొమ్మ ఒక సందేశం, ఐక్యత ను సూచించాలని ఇదిమానసికానందం మాత్రమే కాదు. సామాజిక, స్రుజనాత్మకత కలిగిస్తుంది అని భావం వ్యక్తం చేస్తున్నారు. కొత్తుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లోని పలు సాహితీ సంస్థలు సభ్యులు హాజరయ్యారు.
రిపోర్టర్ : కామేశ్వరరావు (కల్చరల్), విజయనగరం.