BREAKING
కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్

సబ్ జైలు ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Select Suryaa Now
సబ్ జైలు ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

నర్సాపురం, మేజర్ న్యూస్ :ఉమ్మడి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి ఎన్. శ్రీ లక్ష్మీ  గురువారం ఉప కారాగారాన్ని ఆకస్మిక  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, నిందితుల కేసు వివరాలు, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, అనారోగ్యంగా ఉన్న వారికి అందించే వైద్య సదుపాయాలు , ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు.  జైల్ ప్రాంగణంలో ఉన్న ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని అవసరమైన వారు ఉపయోగించుకోవాలని  తెలిపారు.  ధనాశకు పోయి నేర చరిత్రను కలిగి ఉండడం కంటే ఉన్నదానితో సంతృప్తిగా కుటుంబ సభ్యులతో ఉంటడం  మంచిదని, ప్రతి ఒక్కరు మంచి పరివర్తనతో బయటికి వెళ్లాలన్నారు.  వంటశాలను,   స్టోర్ రూమ్ , ఆహార 

పదార్దాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని  జైల్ సిబ్బందిని ఆదేశించారు.  జైలు ముద్దాయిలతో కుటుంబ సభ్యుల కమ్యూనికేషన్ జైలు సిబ్బంది కల్పిస్తున్నారా లేదా  అని ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో  ఉప కారాగారం  పర్యవేక్షణాధికారి  టి. అప్పారావు, జైల్ సిబ్బంది,  ప్రిజన్ విజిటింగ్ ప్యానల్ లాయర్ , కె. చిట్టి పద్మజ,  లీగల్ ఎయిడ్ కౌన్సెల్ కె . శిరీష జైలు సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్ ఇస్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా