రైల్వే స్టేషన్లో జన సంవాద్
రైల్వే స్టేషన్లో జన సంవాద్. పెడన,మేజర్ న్యూస్: ప్రయాణికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా రైల్వే జన సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పట్టణ రైల్వే స్టేషన్ ఎస్ ఎస్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే జన సంవ్వాద్ కార్యక్రమాన్ని ప్రయాణికులతో కలిసి ప్రత్యేక అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా జనసంవాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ కు సంబంధించిన సమస్యలను ప్రయాణికులు అధికారులకు తెలియజేస్తే సత్వర పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ అధికారులు ఎస్ ఎస్ ఈ అధికారులు గుడివాడ నుండి సప్తగిరి మచిలీపట్నం నుండి భాస్కర్ హాజరయ్యారు. ఇరువురు ప్రయాణికుల వద్ద నుండి స్టేషన్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో కొంతమంది ప్రయాణికులు మాట్లాడుతూ రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్, ప్రయాణికుల ద్విచక్ర వాహనాల పార్కింగ్కు భద్రత, వే బ్రిడ్జి వద్ద లిఫ్ట్ సౌకర్యం, భారీ ట్రైన్ లకు ప్లాట్ఫామ్ సరిపోకపోవడంతో ప్లాట్ఫాముల విస్తరణ, మరుగుదొడ్ల శుభ్రత నిర్వహణ, ఇలా అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అంతేగాక చాలా ద్విచక్ర వాహనాలు ఇక్కడ ఉన్న పార్కింగ్లో భద్రత లేకపోవడం వలన దొంగిలించబడ్డాయి అని తెలిపారు.
మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.