రాయలసీమ రైతన్నకు కొత్త భరోసా హార్టికల్చర్ హబ్ అభివృద్ధితో సరికొత్త బాట మంత్రి సవిత
*రాయలసీమ రైతన్నకు కొత్త భరోసా.. హార్టికల్చర్ హబ్‌తో అభివృద్ధికి సరికొత్త బాట — మంత్రి సవిత*
పులివెందుల మేజర్ న్యూస్:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాయలసీమను 'రైజింగ్ రాయలసీమ'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాయలసీమ హార్టికల్చర్ హబ్‌ను సుమారు ₹1,00,000 కోట్ల భారీ వ్యయంతో ప్రారంభిస్తున్నారు.
ఈ నిధుల్లో వరల్డ్ బ్యాంక్ ద్వారా ₹30,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹10,000 కోట్లు, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ₹60,000 కోట్లు సమీకరిస్తున్నారు.
ఇందులో ₹26,000 కోట్లతో రాయలసీమలోని 22 అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తారు.
హంద్రీ-నీవా పోలవరం, వెలుగొండ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీటిని తీసుకొచ్చి శాశ్వత కరువు నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.
హార్టికల్చర్ హబ్ ద్వారా వేర్‌హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీల వ్యవస్థను పటిష్టం చేయనున్నారు.
సూక్ష్మ సేద్యం కింద రైతులకు 90% వరకు సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అందిస్తున్నారు.
ఫామ్ పాండ్స్ నిర్మాణానికి వ్యక్తిగత రైతులకు 50%, కమ్యూనిటీ రైతులకు 75% సబ్సిడీ కల్పిస్తున్నారు.
పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే పథకానికి ముఖ్యమంత్రి ₹450 కోట్లు మంజూరు చేశారు.
స్థానికంగా పండే అరటి, చీనీ పండ్ల రవాణాకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించడంతో పాటు, "లింగాల బనానా" పేరిట ప్రత్యేక బ్రాండ్ సృష్టించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
హార్టికల్చర్ హబ్ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ రైతులు స్వచ్ఛందంగా పులివెందులలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
పింఛన్ల పెంపు (₹4,000, దివ్యాంగులకు ₹6,000, బెడ్‌రిడెన్ వారికి ₹15,000), తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటి ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది.