రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు లింగాల విద్యార్థులు
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు లింగాల విద్యార్థులు
లింగాల మేజర్ న్యూస్:
లింగాల మండలంలోని జెడ్.పీ.హెచ్.ఎస్. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి విశ్వవర్ధన్ రగ్బీ క్రీడలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో కర్నూలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో జిల్లా జట్టు తరఫున విశ్వవర్ధన్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.
అదేవిధంగా హాకీ క్రీడలో అండర్-14, అండర్-17 బాలికల విభాగంలో కడప స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాఠశాల విద్యార్థినులు పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరికి కోచ్ సుష్మ, మౌనిక శిక్షణ అందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ జి. మల్లేశ్వరి, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.