BREAKING
రెండు రోజుల పాటు గోదావరి నీటి సరఫరా బంద్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. సినిమాల్లో AI రాకతో ఏం మారుతోంది? వడ్ల లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్.. నలుగురు అరెస్టు వీఎంఆర్‌డీఏ ప్రజాదర్భార్ కు విశేష స్పందన 587 మిలియన్ డాలర్ల స్పాక్ ఒప్పందం ఫైసర్వ్‌పై ఆక్టివిస్ట్ నిధుల సంస్థ జానా ఒత్తిడి బ్రిటన్‌లో రోల్స్ రాయిస్ భారీ పెట్టుబడులు నాలుగు జిల్లాలకు జిల్లా విద్యాధికారుల మార్పు సంతమాగులూరు ప్రాంత విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం టాలీవుడ్ మాస్ సినిమాలకు సరికొత్త నిర్వచనం.. హీరో క్యారక్టరైజేషన్‌కు కేరాఫ్ అడ్రస్ పూరీ జగన్నాథ్ చిత్తూరు బిడ్డకు అంతర్జాతీయ గౌరవం గణేశుని లడ్డు వేలంపాటలో దక్కించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నార్కట్‌పల్లిలో రైతులకు అవగాహన సదస్సు ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్* సంస్కార్ విద్యాలయంలో వృక్ష రక్షాబంధన్.

రాజీవ్ నగర్ కాలనీవాసుల ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలి

Select Suryaa Now
రాజీవ్ నగర్ కాలనీవాసుల ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలి

రాజీవ్ నగర్ కాలనీ వాసుల ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలి

నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కల్పించే వరకు కూల్చివేతలు వద్దు: వైఎస్ మనోహర్ రెడ్డి

పులివెందుల మేజర్ న్యూస్ :

ముద్దనూరు–కొడికొండ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పులివెందులలోని రాజీవ్ నగర్ కాలనీ వాసులు తమ నివాసాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వైఎస్ మనోహర్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
గత కొంతకాలంగా రాజీవ్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని, వారికి రావాల్సిన నష్టపరిహారం అందించి, ప్రత్యామ్నాయ నివాస సౌకర్యం కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు.
అయితే సోమవారం రోడ్డు విస్తరణ అధికారులు మరోసారి ఇళ్లను తొలగించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించడంతో కాలనీ వాసులు ఈ విషయాన్ని వైఎస్ మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు హాల్ గంగాధర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు పార్నపల్లి కిషోర్, సీనియర్ నాయకులు కోడి రమణ తదితరులతో కలిసి ఆర్డీఓను కలిసి పరిస్థితిని వివరించారు.
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా చూడాలని ఆర్డీఓను కోరారు. బాధితుల జీవనోపాధి, నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఆర్డీఓ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, బాధితులకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి కూల్చివేతలు ఉండబోవని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ నాగరాజు, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.