ప్రజాసేవే లక్ష్యంగా రాజగోపాల్.. ఎంపీటీసీ బరిలో నామినేషన్
పరిగి మేజర్ న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన శుక్రవారం టీడీపీ తరుపున శిరేకోళం–హోన్నంపల్లి ఎంపీటీసీ స్థానానికి రాజగోపాల్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనే లక్ష్యంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.రాజగోపాల్ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తన పరిధిలో సాధ్యమైనంత మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. దానధర్మాలు చేయడంతో పాటు వివిధ దేవాలయాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ సామాజిక సేవలో భాగస్వామిగా నిలుస్తున్నారని తెలిపారు.ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా రాజగోపాల్ గుర్తింపు పొందారని స్థానికులు చెబుతున్నారు. ఎంపీటీసీగా అవకాశం లభిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు శ్రీకోళం, పొన్నంపల్లి గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ నామినేషన్ దాఖలు చేయడంతో శ్రీకోళం–పొన్నంపల్లి ఎంపీటీసీ స్థానం ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
పరిగి సూర్య రిపోర్టర్ నవీన్.