పోలీస్ అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం
--ఏలూరు సూర్య న్యూస్: రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు పోలీసు ప్రధాన కార్యలయం వద్ద గల పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు పోలీసు అమరవీరుల స్మృతి దినం- 2026 కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ ఏలూరు ఐజి జి.వి.జి. అశోక్ కుమార్ , అతిథిగ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హాజరయ్యారు. అమరవీరుల స్మృతి దినం సభకు విచ్చేసిన వారందరకి ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ స్వాగ తం పలికారు.
పోలీసు సిబ్బంది కవాతు కు కమెండర్ గా ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్ నిర్వహించి అమర వీరులు కు స్మృతి పేరేడు ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ అమరవీరుల పోలీస్ కుటుంబాల సభ్యులందరికీ కూడా వారి శుభాకాంక్షలు తెలిపారు, ఎందరో మహానుభావులు వారు కాకీ యూనిఫామ్ని ధరించి వారి అమూల్యమైనటువంటి ప్రాణ త్యాగాల వలన ప్రజలకు సేవ అందించేటటువంటి భాగ్యం యూనిఫామ్ ధరించిన ప్రతి ఒక్కరికి కలిగింది అన్నారు. కరోనా సమయంలో ఎంతో నిబద్ధతతో ప్రజల ప్రాణాలకు పోలీసు అధికారులు సిబ్బంది ప్రాణాలను అడ్డంగా పెట్టి విధి నిర్వహణ చేయడం వలన కరోనాని కంట్రోల్ చేయగలిగామని ఎస్పీ వివరించారు. రోడ్ యాక్సిడెంట్స్ వలన గాని ఆరోగ్య సమస్యల వలన గాని పోలీసు అధికారులు వారి పవిత్రమైనటువంటి ప్రాణత్యాగం చేశారని అందులో ఐపీఎస్ అధికారులు దగ్గర్నుంచి కింది స్థాయి అధికారులు వరకు ఎంతో ప్రాణత్యాగం చేశారని అటువంటి వారిని వ్యక్తికి తెచ్చుకునేలాగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి భవనాలకు అధికారుల పేరులను చిరస్థాయిగా ఉండేలాగా భవనాలకు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ప్రాణం త్యాగం చేసినటువంటి అధికారుల కుటుంబాలలో అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారి సహకారంతో కారుణ్య నియామకాలు జరిపామని, ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ పోలీసు విధి నిర్వహణలో వారి సహాయ సహకారాలను అందిస్తూ పోలీసు అధికారుల ఆరోగ్యాల పట్ల యోగక్షేమలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సహాయ సహకారాలు అందించారని ఎస్పీ శివ కిషోర్ పేర్కొన్నారు. అతిధి గా పాల్గొన్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల సేవ, ప్రాముఖ్యతను, త్యాగాన్ని కొనియాడారు. ఆపద సమయాలలో ముందుగా గుర్తొచ్చేది పోలీసులేనని అటువంటి పోలీసులు ముందుగా నిలిచి వారి అమూల్యమైనటువంటి ప్రాణత్యాగం చేసి వారు అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారని, అలాగే ఫస్ట్ రెస్పాన్స్ ఫోర్స్ అని బిరుదు ఉన్నదని తెలిపారు. వీరమరణం పొందినటువంటి అమరవీరులకు ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమని హామీ ఇచ్చారు. ముఖ్య అతిథి ఏలూరు రేంజ్ ఐజీ జివిజి అశోక్ కుమార్ మాట్లాడుతూపోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు అని, భారత్-చైనా సరిహద్దుల్లోని గతములో ఆర్మీ వారి గస్తీ లేని సమయంలో డీఎస్పీ కరణ్ సింగ్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ దళాలు ఆక్సయ్ చిన్ వేడి నీటి బుగ్గ (హాట్ స్ప్రింగ్స్) గస్తీ నిర్వహిస్తున్న సమయం అమరులైన సిఆర్పిఎఫ్ దళాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నుండి వారం రోజులు పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 154 మంది అమర వీరుల పేర్లు లను జిల్లా అధనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాద్ రావు అమర వీరులు యొక్క పేరు లను ఈ కార్యక్రమములో చదివి విన్పించి శ్రద్దాంజలి ఘటించి నారు.ఈ కార్యక్రమము నకు అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఏలూరు డిఎస్పీ డీ శ్రావణ్ కుమార్ , ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు గారు ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ , ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఆర్ఐ పవన్ కుమార్ ఎస్ఐలు , ఆర్ఎస్ఐ లు, ఏఆర్.ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.