పసుపుమయమైన ఆత్మకూరు
పసుపుమయమైన ఆత్మకూరు
--టీడీపీ వైపు వైసీపీ శ్రేణుల పరుగులు
--మంత్రి ఆనం సమక్షంలో టీడీపీ గూటికి 200 కుటుంబాలు
--మంత్రి ఆనం నాయకత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు
ఆత్మకూరు,మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
ఆత్మకూరు పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ వైపు వైసీపీ శ్రేణుల పరుగులు మొదలయ్యాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆత్మకూరు పట్టణం పసుపుమయమైంది.
బుధవారం ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కల్యాణ మండపంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలతో పాటు దాదాపు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ చేరికలతో ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజారంజక పాలన, ఆత్మకూరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
ఆత్మకూరు పట్టణ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, పురపాలక సంఘ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారనే విశ్వాసాన్ని మంత్రి ఆనం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధపై పూర్తి విశ్వాసంతోనే టీడీపీలో చేరినట్లు తెలిపారు. రానున్న పురపాలక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేస్తామని ప్రకటించారు.
ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరందుకోవడం, మరోవైపు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతుండటంతో ఆత్మకూరు పురపాలక ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు, మున్సిపల్ తెలుగుదేశం చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారక్ నాధ్ రెడ్డి,పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం లీలా కైవల్యా రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, మండల టిడిపి అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు మాజీ మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు అబ్బూరు రమేష్ నాయుడు, కంచర్ల మాధవి, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తోడేటి వెంకటయ్య,మాజీ కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి,పొడమేకల పెంచలయ్య యాదవ్, షేక్ రేష్మ,ఆత్మకూరు మున్సిపాలిటీకి కౌన్సిల్ అభ్యర్థులుగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ లు తలచీరు బాబు నాయుడు, పి.సాగర్, బిజెపి సీనియర్ నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి, పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.