పలమనేరులో టీడీపీ నామినేషన్ల సందడి.. శ్రేణుల్లో జోష్!
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లతో పలమనేరులో సందడి నెలకొంది. టీడీపీ కార్యాలయానికి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి టీడీపీ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి అభ్యర్థులు ర్యాలీగా నామినేషన్ కేంద్రాలకు వెళ్లి పత్రాలు సమర్పించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్