పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల జోరు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
మున్సిపల్ ఎన్నికల్లో మూడో రోజు నామినేషన్లు జోరుగా సాగాయి. చైర్పర్సన్ స్థానానికి 7, 36 వార్డులకు 150 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ లోకేశ్వర వర్మ తెలిపారు. చైర్పర్సన్ నామినేషన్లలో కాంగ్రెస్ 1, టీడీపీ 3, వైఎస్సార్సీపీ 3 ఉన్నాయి. వార్డు నామినేషన్లలో టీడీపీ 69, వైఎస్సార్సీపీ 62, జనసేన 6, స్వతంత్రులు 6, ఎస్డీపీఐ 4, బీజేపీ 3 ఉన్నాయి.