BREAKING
నిజమే పెళ్లి చేసుకుంటున్నా.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో తేజ సజ్జా కందుకూరు మండల కేంద్రంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న త్రిదండి షటకోప రామానుజా స్వామీ అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య* మళ్లీ తెరపైకి మెగాస్టార్ ‘విశ్వంభర’.. సంక్రాంతి బరిలో నిలిచేనా భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర గంగమ్మ ఒడిలోకి దుర్గమ్మ 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గార్ల లో ప్రవేట్ క్లినిక్ ల నిర్వహకులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దసరా శుభాకాంక్షలు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష ప్రచారం కిష్టాపూర్ పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు మాదాపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి గంగావతి!¡ ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోలో శ్రావ్య వర్మ జోరు.. గట్ ఫీలింగ్‌తో నెట్టింట చర్చకు కేంద్రంగా మారిన వైనం

పగిడ్యాల జెడ్పీటీసీ అభ్యర్థిగా బండి రమణమ్మ..!

Select Suryaa Now
పగిడ్యాల జెడ్పీటీసీ అభ్యర్థిగా బండి రమణమ్మ..!

పగిడ్యాల జెడ్పీటీసీ అభ్యర్థిగా బండి రమణమ్మ..!
-  నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి
-శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా గుర్తింపు 
- మండలంలో సర్పంచ్ గా పలు అభివృద్ధి పనులు

పగిడ్యాల మేజర్ న్యూస్ -: నందికొట్కూర్ నియోజవర్గ పరిధిలోని పగిడ్యాల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బండి రమణమ్మ గురువారం నంద్యాలలో నామినేషన్ దాఖలు చేశారు. గుంపుల శ్రీనివాసులు,  పాలమర్రి నాగరాజు ఆమెను ప్రతిపాదించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బండి రమణమ్మ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాల మేరకు పగిడ్యాల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. 2001నుండి 2006వరకు నెహ్రూనగర్ సర్పంచ్ గా పలు అభివృద్ధి పనులు పనిచేశానన్నారు . ఆనాడు ఎమ్మెల్యే గౌరు చరిత సహాకారంతో గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా  మెరుగుపరచి , క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ మందు 1500వేలపక్కాగృహాలు, 1200వందలమందికి పెన్షన్ లుమంజూరు చేయించడం జరిగిందన్నారు. గ్రామంలో మౌళిక వసతులు కల్పించడం తోపాటు, గ్రామాభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందన్నారు. నెహ్రూనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా, తెలుగు దేశం పార్టీ గత కమిటీలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేశానన్నారు. 2014 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నానన్నారు.
తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా తమకు బీ-ఫారం ఇచ్చినా లేకపోయినా మరోక అభ్యర్థికి బీ-ఫాం ఇచ్చినా  కల్పించినా , తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాననీ అన్నారు.  పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని, పార్టీ గెలుపే తన లక్ష్యమని బండి రమణమ్మ పేర్కొన్నారు.