నందికొట్కూరులో కూటమి జెండాను ఎగురవేద్దాం...!
నందికొట్కూరులో కూటమి జెండాను ఎగురవేద్దాం...!
- సమన్వయంతో అందరం అడుగులు వేద్దాం..
- కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం
-స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెడదాం
- మాండ్ర, జయసూర్యలతో అభిరుచి మధు భేటీ
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్- :
నందికొట్కూరు నియోజకవర్గంలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జి శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జి.జయసూర్యలతో కలిసి అభిరుచి మధు ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ.. మూడు పార్టీల (టీడీపీ, జనసేన, బీజేపీ) శ్రేణులు క్షేత్రస్థాయిలో పూర్తి ఐకమత్యంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థుల ఎంపికను నాయకులంతా కూర్చుని సామరస్యంగా పూర్తి చేద్దామని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఏమాత్రం తావులేకుండా నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలన్నింటినీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేద్దామని అభిరుచి మధు పేర్కొన్నారు.ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి, సమిష్టి కృషితో అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి నందికొట్కూరులో కూటమి జెండాను సగర్వంగా ఎగురవేద్దామని ఆయన ఆకాంక్షించారు.