నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు * ఎస్ చిన్న రాముడు *
పాచిపెంట, సూర్య : పాచిపెంట మండలంలో నిర్వహిస్తున్న స్థానిక ఎంపీటీసీ ఎన్నికలు నామినేషన్లు ప్రక్రియపై జిల్లా ఎన్నికల పరిశీలికలు ఎస్. చిన రాముడు సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన తరువాత బ్యాలెట్ బాక్స్ ల స్ట్రాంగ్ రూమును తనిఖీ చేశారు. రిటర్నింగ్ అధికారి రాధాకృష్ణ, ఎంపీడీవో బి వి జె పాత్రో, తాసిల్దార్ రవికి పలు సూచనలిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మీరంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయనతోపాటు పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ రహర్ ఎన్నికల నామినేషన్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విధులు చక్కగా నిర్వహిస్తున్నారని తాహసిల్దార్ కు కితాబు ఇచ్చారు. నామినేషన్ పర్వం ముగియడంతో స్థానిక అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చక్కగా నామినేషన్లు జరిగాయని సంతృప్తి చెందారు. రూరల్ సీఐ పి రామకృష్ణ నామినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సై ఎల్ అర్జున్ కు మరియు పోలీస్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
73 నామినేషన్లు దాఖలు :- పాచి పెంట మండలంలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను మూడు రోజుల్లో 73 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాధాకృష్ణ విలేకరులకు తెలిపారు. బుధవారం నాడు 11, గురువారం నాడు 30, శుక్రవారం నాడు 32 నామినేషన్లు పడ్డాయని వివరించారు.
రిపోర్టర్ : ప్రసాద్ రాజు, పార్వతీపురం మన్యం.