BREAKING
వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు

మంత్రి కృషి తో అభివృద్ధి పథంలో రామచంద్రపురం

Select Suryaa Now
మంత్రి కృషి తో అభివృద్ధి పథంలో రామచంద్రపురం

రామచంద్రపురం మేజర్ న్యూస్ :

రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి మరో ముందడుగుగా రూ.77.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్. రాజు, మున్సిపల్ డిఈ  శ్రీకాంత్, కూటమి నాయకులుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు  అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వాసంశెట్టి సత్యం సూచించారు.

శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు 

26వ వార్డు – గొల్లల వీధి

డి.నెం. 8-4-13/1 నుంచి శ్రీకృష్ణ దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం - రూ.6.47 లక్షలు.

అదే మార్గంలో సీసీ డ్రెయిన్ నిర్మాణం – రూ.3.63 లక్షలు.

4వ వార్డులో 

వాటర్ షెడ్ నుంచి ప్రస్తుత కార్యాలయం వరకు సీసీ డ్రెయిన్ నిర్మాణం- రూ.5.77 లక్షలు.

6వ వార్డులో 

శీలంవారి సావరం అవుట్‌లెట్ వద్ద స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం- రూ.31.75 లక్షలు.

11వ వార్డు – ధనకోటి లేఔట్,ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ నుంచి డి.నెం.30-2-49 వరకు సీసీ రోడ్డు నిర్మాణం - రూ.18.94 లక్షలు.

13వ వార్డు – శ్రీరాంపేట

డి.నెం.31-8-8/17 నుంచి డి.నెం.31-8-8/5 వరకు సీసీ రోడ్డు నిర్మాణం – రూ.7.23 లక్షలు.

18వ వార్డులో డి.నెం.32-2-22A నుంచి డి.నెం.33-2-21/1 వరకు సీసీ రోడ్డు నిర్మాణం-రూ.3.51 లక్షలు కాగా మొత్తం రూ.77.30 లక్షల వ్యయంతో ఈ అభివృద్ధి పనులుకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక చొరవతో రామచంద్రపురం పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. మంత్రి సుభాష్ నిరంతర కృషి ఫలితంగా గత రెండేళ్ల కాలంలోనే రామచంద్రపురం పట్టణంలో సుమారు రూ.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్. ఆర్ రాజు మాట్లాడుతూ  రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడుతూ పట్టణాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి కొనసాగిస్తామని వాసంశెట్టి సత్యం, కమిషనర్ రాజు   స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు  ఉండవెల్లి శివ, ఉపాధ్యక్షులు చందమామ వాసు,ఎస్ కే పి పి ట్రస్ట్ చైర్మన్  సలాది నాయుడు, కంచుమర్తి బాబురావు, మేడిశెట్టి సూర్యనారాయణ, కట్టా నాగేశ్వరావు,కడియాల రాఘవన్,నారపురెడ్డి బలరాం, దంగేటి గౌరీశంకర్, జాస్తి విజయలక్ష్మి, అల్లం శ్రీనివాస్, అంకం శ్రీనివాస్, బళ్ల లక్ష్మి, దొమ్మలపాటి విజయలక్ష్మి, ఏసుదాసు, చింతాకుల ప్రకాష్, మనోజ్,శ్రీనివాస్ కూటమి పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.